A traffic rsi lost life in a road mishap in medchal on Thursday night <br />సికింద్రాబాద్ ఓల్డ్ కాప్రాలో దారుణం చోటుచేసుకుంది. ఓ కారు ట్రాఫిక్ ఏఎస్సైని ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. కనీసం ఆసుపత్రికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం ఎవరూ చేయలేదు. రోడ్డుపై పడిఉన్న ఆయన్ను అటుగా వెళ్తున్న వారు కూడా చూసి సహాయం చేసే ప్రయత్నం చేయలేదు. ఈ సంఘటన వివరాల్లోకి వెళ్తే సికింద్రాబాద్ ఓల్డ్ కాప్రాలో మోటార్ సైకిల్‌పై వెళ్తున్న ట్రాఫిక్ ఏఎస్సై లక్ష్మణ్‌ను ఒక కారు ఢీకొంది. దీంతో ఆయన కిందపడిపోయారు. అయితే... కారు ఆగకుండానే వెళ్లిపోయింది. ఆ తర్వాత అదే దారిలో వస్తున్న మరో కొంతమంది వాహనదారులు కూడా అలా చూస్తూ వెళ్లిపోయారే తప్ప కనీసం ఆగి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయలేదు. <br />
